లండన్ లో బతుకమ్మ

ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఉత్సవాలు సాయంత్రం ఏడు గంటల వరకు జరిగాయి. తెలంగాణ సంప్రదాయ బతుకమ్మతో ప్రారంభమైన ఉత్సవాలు జమ్మి పూజ, పిల్లల సాంస్కృతిక నృత్యాలతో ఉత్సాహభరితంగా సాగాయి. చిన్న పిల్లలు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అమెరికా నుంచి వచ్చిన శ్రీరామ్ వెదెరె ఆంధ్రప్రదేశ్ లోని జలవనరులపై, ఆ జలవనరుల వినియోగంపై మాట్లాడారు. తెలంగాణలో జలవనరులను ఉపయోగించుకోవాల్సిన తీరును కూడా ఆయన వివరించారు.
తెలంగాణ కోసం పోరాడుతున్న నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ కూడా జరిగింది. తెలంగాణ జెఎసి నేత కోదండరామ్, గాయకుడు దేశపతి శ్రీనివాస్, కెసిఆర్, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ, బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి, బిజెపి శాసనసభ్యుడు లక్ష్మినారాయణ లండన్ లోని ప్రజలకు తెలంగాణ సందేశం అందించారు. సాధ్యమైనంత త్వరగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని యుకె, ఐరోపా టిడిఎఫ్ అధ్యక్షుడు ఉదయ్ నాగరాజు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రధాన కార్యదర్శి వేణు గంపా బతుకమ్మ పండుగ సందర్భంగా సెలవు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ ఉత్సవాల్లో పాల్గొన్నందుకు మీడియా, పబ్లిక్ రిలేషన్స్ కార్యదర్శి నాగేందర్ చిందం లండన్ ఎన్నారైలను అభినందించారు.
టిడిఎఫ్ వర్కింగ్ కమిటీ సభ్యులు చంద్రశేఖర్, అనిల్ కూర్మాచలం, నాగేష్, నర్సారెడ్ిడ, కిరణ్ పసునూరి, సుధాకర్ గౌడ్, అశోక్ బాల్నే, అడ్వయిజరీ బోర్డు సభ్యులు కమల్ ఓరుగంటి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి విశేష కృషి చేశారు. లండన్ కమల్ సొలిసిటర్స్ లిమిటెడ్ బతుకమ్మలకు ప్రథమ, ద్వితీయ బహుమతులు ప్రకటించడం జరిగింది. జయశ్రీ గంపాకు ప్రథమ బహుమతిని, బేబీ నిశ్చల బైరీకాకు ద్వితీయ బహుమతిని కొలిన్ ఎల్లర్ ప్రదానం చేశారు.












Click it and Unblock the Notifications