రాష్ట్రం కోసం తెలంగాణ ఎన్నారైలు

శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఉంటుందనే నమ్మకం లేదని, తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు శాంతియుతంగా ఉద్యమాన్ని నడిపించాలని సమావేశం తన అభిప్రాయం వ్యక్తం చేసింది. విద్యార్థులపై కేసులను ఎత్తేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీరును సమావేశంలో విమర్శించారు. విజయవాడ అల్లర్ల కేసులను, ఢిల్లీ అల్లర్ల కేసులను ఎత్తేసినప్పుడు విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తేయడానికి వచ్చిన ఇబ్బందులేమిటని వక్తలు ప్రశ్నించారు. రఘువీరా రెడ్డి, సుధీర్ గూడ, మహేంద్ర గణపురం, శ్రీనివాస్ దామెర, సురేష్ రెడ్డి, శ్రీనివాస్ తిప్పన, రామ్ కాసర్ల, పవన్ నెల్లుట్ల, అజయ్ రెడ్డి, అనిల్ బొద్దు, అనంత్ పజ్జూరు, సతీష్ రెడ్డి, వెంకట్ కొండల, భాస్కర్ గార్లపాటి, రఘు చిట్టిమల్ల, గంగ దేవర, రవి వెనిశెట్టి, అరవింద్ రెడ్డి, స్వరూప్ కుందూరు, శ్రీని రెడ్డి, రఘువీర్ బండారు, వెంకట్ షేరి, శ్రీనివాస్ సురకంటి, తదితురులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు వెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సమావేశం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.












Click it and Unblock the Notifications