డెట్రాయిట్ లో బతుకమ్మ సందడి

NRI
అమెరికాలోని తెలంగాణ ఎన్నారైలు డెట్రాయిట్ లో బతుకమ్మ పండుగను ఆనందోత్సహాల మధ్య జరుపుకున్నారు. డెట్రాయిట్ తెలంగాణ కమ్యూనిటీ ఆధ్వర్యంలో శనివారం ఈ బతుకమ్మ పండుగ జరిగింది. మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో అతి పెద్ద బతుకమ్మ పండుగ జరిగింది. అనిత బొమ్మనవేని స్వాగతోపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమైంది. సంప్రదాయ దుస్తుల్లో పిల్లలు, పెద్దలు వాతావరణాన్ని ఉల్లాసభరితం చేశారు. పాటలు పాడుతూ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ మహిళలు పండుగను జరుపుకున్నారు. ఉత్తమ బతుకమ్మలకు అవార్డులు కూడా ఇచ్చారు. ఉత్తమ బతుకమ్మలకు నంది అవార్డు గ్రహీత అందెశ్రీ ట్రోఫీలు అందజేశారు. బిందు జ్యోతికి ప్రథమ బహుమతి లభించింది. అనిత బొమ్మనవేనికి ద్వితీయ బహుమతి, స్వరాజ్య లక్ష్మికి తృతీయ బహుమతి లభించాయి.

జయ జయహే తెలంగాణ పాటను అందెశ్రీ ఆలపించారు. వరుసగా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. పిల్లలు ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాలు పంచుకున్నారు. శోభా తూముకుంట్ల, భారతి అయిత, జ్యోతి మారోజు, అనితా బొమ్మనవేని కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. కమిటీ సభ్యులు నాగేందర్ అయిత, రఘు బోడ, మురళి బొమ్మనవేని, రాజు బ్రహ్మానందభేరి, శ్యాం ఇనగంటి, దామోదర్ గాంకిడి, శ్యాం జిల్లల, ప్రవీణ్ జొన్నలగడ్డ, సంతోష్ కాకులవరం, ప్రవీణ్ కేశిరెడ్డి, భరత్ మాదాడి, వెంకట్ మంతెన, హరి మారోజు, సునీల్ మర్రి, అశోక్ పెనుమాండ్ల, భుజంగరావు, రామ్ రెడ్డి, శైలేంద్ర శానం, రామ్ గోపాల్ ఉప్పల ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+