అమెరికాలోని బే ఏరియాలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సభ సెప్టెంబర్ 4వ తేదీన జరుగుతుంది. వైయస్సార్ అభిమానులు, ఇడియాఈవెంట్స్ డాట్ ఇన్ఫో వారు, స్థానిక కమ్యూనిటీ లీడర్లు, సంఘాలవారి సహకారంతో సన్నీవాలెలోని స్నేహ ఇండియన్ రెస్టారెంట్ లో మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. సర్వమత ప్రార్థనలు కూడా ఉంటాయని ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు శివారెడ్డి ఎర్రగూడి, మణికొండ శ్రీనివాస రెడ్డి, వంశీ కె రెడ్డి. వైవి శివకుమార్ రెడ్డి చెప్పారు. స్థానిక కమ్యూనిటీ నాయకులు కూడా ఈ సమావేశంలో ప్రసంగిస్తారు. డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి జీవితానికి, కాలానికి సంబంధించిన స్లయిడ్ షోలు కూడా ఉంటాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు. బే ఏరియాలో ఇంతకు ముందు కూడా వైయస్ రాజశేఖర రెడ్డి జీవితానికి, కాలానికి సంబంధించిన పలు కార్యక్రమాలు నిర్వహించారు.