బ్రిటన్ లో నివసించే ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువ న్యాయవాది పావనిరెడ్డి ఉన్నత గౌరవం పొందారు. ఆమె 2010 ఆసియన్ మహిళగా బంగారు పురస్కారం అందుకున్నారు. బ్రిటన్ న్యాయశాఖ సహాయమంత్రి లార్డ్ టామ్ గురువారం జరిగిన 10వ ఆసియన్ విజేతల పురస్కారాల ప్రదానోత్సవంలో ఆమెకు ప్రదానం చేశారు. ప్రముఖ న్యాయసేవా సంస్థ 'జైవాలా అండ్ కో' మేనేజింగ్ భాగస్వామిగా పావని వ్యవహరిస్తున్నారు.