అరిజోనాలో ఘనంగా తెలుగువారి సంక్రాంతి

NRI
అరిజోనా: ప్రత్యేక, సమైక్య ఉద్యమాలు ఆంధ్రప్రదేశ్ లోని తెలుగువారిని అతలాకుతలం చేస్తుండగా అమెరికాలోని తెలుగువారు సంక్రాంతి సంబరాలను ఆనందంగా జరుపుకున్నారు. యునైటెడ్‌ తెలుగు ఫౌండేషన్‌, అరిజోనా తెలుగు అసోసియేషన్‌ సంయుక్తంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు మంచి స్పందన లభించింది. దాదాపు 200 మందికి పైగా ప్రవాసాంధ్రులు ఈ సంక్రాంతి సంబరాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారుల కాస్ట్యూమ్స్‌ పోటీతో వేడుకలు ఆరంభమయ్యాయి. సంక్రాంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలో పాల్గొన్న దాదాపు 50 మందికి పైగా మహిళలు తీర్చిదిద్దిన రంగు రంగుల రంగవల్లులు అందరినీ ఆకట్టుకున్నాయి.

స్థానిక తెలుగు వారితో పాటు పలువురు అరిజోనా వాసులు ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించారు. అనంతరం వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. పెద్దలకు టెన్నికాయిట్‌, కబడ్డీ, వాలీబాల్‌ వంటి ఆటల పోటీలు నిర్వహించగా, చిన్నారులు క్రికెట్‌ తదిరత క్రీడలతో ఉల్లాసంగా గడిపారు. ఈ పోటీలలో గెలుపొ ందిన వారికి యునైటెడ్‌ తెలుగు ఫౌండేషన్‌ బహుమతులను ప్రదానం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+