న్యూజెర్సీ: అమెరికాలోని న్యూజెర్సీలో శనివారం శ్రీనివాస కల్యాణం వైభవంగా జరిగింది. మోర్గాన్ విల్లే నగరం గురువాయూరప్పన్ ఆలయంలో ఉదయం 10.30 గంటల(భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30)కు కల్యాణం ప్రారంభమైంది. అంతకు ముందు ఉదయం సుప్రభాతం సేవతో స్వామి వారిని మేల్కొలిపారు.
తోమాల, అర్చన సేవలు నిర్వహించారు. వందలాది మంది మహిళలు, పురుషులు తెలుగు సంప్రదాయ వస్త్రధారణతో స్వామి వారి సేవల్లో పాల్గొన్నారు. 33 ఎకరాల విస్తీర్ణంలోని ఆలయంలో నిర్వహించిన కల్యాణానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు.