వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'తానా' స్కాలర్ షిప్ లు పొందేది ఇలా...

By Santaram
|
Google Oneindia TeluguNews

TANA
అమెరికా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2010-11 విద్యా సంవత్సరానికి ఉపకారవేతనాలు మంజూరు చేసేందుకు ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నివసిస్తున్న విద్యార్థులు మాత్రమే దీనికి అర్హులు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో రానున్న విద్యా సంవత్సరంలో ఉన్నత విద్యాభ్యాసం చేసేందుకు వచ్చే ప్రతిభ గల తెలుగు విద్యార్థులకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి 'తానా' ముందుకొస్తోందని సంఘం ప్రతినిధి యలమంచిలి రావు తెలిపారు.

ఉపకారవేతనం పొందడానికి దరఖాస్తు చేసే విద్యార్థి గత విద్యాసంవత్సరానికి సంబంధించి అన్ని పరీక్షలు ఉత్తీర్ణుడై ఉండాలని చెప్పారు. మరిన్ని వివరాలకు వెంకటరమణ యార్లగడ్డ ([email protected]) ప్రసాద్‌ చౌదరి కాకరాల([email protected]) లను సంప్రదించాలని కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X