సిడ్నీలో బతుకమ్మ పండుగ

NRI
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆస్ట్రేలియా తెలంగాణ ఫోరం ఈ ఉత్సవాలను నిర్వహించింది. దాదాపు 50 కుటుంబాలకు చెందిన 200 మంది ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. గరం మిర్చీ, కూల్ డ్రింకులు అందించడంతో ఈ నెల 16వ తేదీ ఉదయం 11 గంటలకు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పిల్లలకు, పెద్దలకు డాక్టర్ నిరుపమ, వాణి ఏలేటి పిక్నిక్ గేమ్స్ నిర్వహించారు. సిడ్నీలోని పర్రమట్ట సరస్సు తీరే బతుకమ్మలతో మారిపోయింది. తెలంగాణ కోసం అమరులైనవారికి నివాళులు అర్పించిన తర్వాత బతుకమ్మ పండుగ ప్రారంభమైంది. సంప్రదాయ దుస్తులు ధరించి మహిళలు బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పాటలతో భవానీ కార్యక్రమాన్ని రసభరితం చేశారు. మంగళహారతులతో బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకుని వెళ్లి పర్రమట్ట సరస్సులో నిమజ్జనం చేశారు.

యునైటెడ్ ఇండియన్ అసోసియేషన్స్ కు చెందిన అరుణ చంద్రాల ముఖ్య అతిథిగా విచ్చేశారు. డాక్టర్ హేమ చందర్, సుజాత హేమ చందర్, డాక్టర్ భారతీరెడ్డి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. బతుకమ్మ పండుగ నిర్వహించిన తీరుకు వారు కవిత, వాణి, నిరుపమ, స్వర్ణ, జయ, చంద్రకళ, అనురాధ, సుజాత, భవానీ, సరళ, కరుణ, పద్మజ, మధులను అభినందించారు. వినోద్, సోమవేశ్వర్ రెడ్డి, నరేష్, మాధవ్, రవికాంత్, ప్రమోద్, అశోక్, దేవేందర్, ఇంద్రసేన్, ఉపేందర్, రాజశేఖర్, జయపాల్, నర్సింగ్ రావు, మధు, సాగర్ రెడ్డిలను ఆస్ట్రేలియా తెలంగాణ ఫోరం అధ్యక్షుడు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డి అభినందించారు. స్పాన్సరర్లు హైదరాబాద్ ట్రావెల్స్ కు చెందిన డాక్టర్ ఈశ్వర్ మదాస్, ఫెర్ఫ్యూమ్ బే, టాక్స్ నెట్ అస్ట్రేలియాలకు రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+