డల్లాస్ లో బతుకమ్మ

బతుకమ్మలను నిమజ్జనం చేసిన తర్వాత దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పూజారి జమ్మి పూజ నిర్వహించారు. క్రికెట్, వాలీబాల్ దసరా కప్ పోటీలు జరిగాయి. దసరా వేషాలు, ఉత్తమ బతుకమ్మల పోటీలు జరిగాయి. దసరా మేళా కూడా ఆకర్షణీయంగా మారింది. రెడ్డి న్యూమాన్ పిసి, డ్రీమ్ హోమ్ మార్టిగేజ్, రుచి ప్యాలెస్, స్కైపాస్ ట్రావెల్స్ సహకారం అందించాయి. యువ మీడియా, ఫన్ ఆసియా, ఎక్ నజర్, రీచ్ ఎన్నారై, టీవీ9 కూడా ఇందులో పాల్గొన్నాయి.
పవన్ నెల్లుట్ల, డాక్టర్ కస్తూరి ఇనగంటి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఇందు రెడ్డి, కల్యాణ్ దుర్గ్, సంధ్యా గవ్వా, శ్యామ రుమల్లా, హరిణి మేడిచెర్ల, మహేందర్ గన్నవపు, భాను చౌదరి, డాక్టర్ శ్రీనివాస్ గునుకుల, రఘువీర్ బండారు వివిధ పాత్రలు ధరించారు, కార్యక్రమ విజయానికి కృషి చేశారు. టాంటెక్స్ తరఫు ఎన్ఎంఎస్ రెడ్డి, గీతా ధామన్ అతిథులకు సత్కారాలు చేశారు. బతుకమ్మ, దసరా సమన్వయ కమిటీ సభ్యులు ఇందు రెడ్డి మందాడి, కరుణాకర్ దాసరి, రామ్ కాసర్ల, శశి కనపర్తి, శేఖర్ బ్రహ్మదేవర, శ్యామ రుమల్లా, శ్రీనివాస్ కూతురు, ఉపేందర్ బూడిద ఉత్సవాల విజయానికి కృషి చేశారు.












Click it and Unblock the Notifications