యుఎస్ సీనియర్ దౌత్యవేత్తగా తెలుగు భాస్కరుడు

సౌదీ అరేబియా, ఈజిప్టు మరియు పాలస్తీనాలో పనిచేసిన ఆయన హైదారాబాద్‌లో పాస్‌పోర్ట్ అధికారిగా కూడా పనిచేశారు. బాలభాస్కర్ హాయాంలో హైదారాబాద్‌లోని పాస్‌పోర్ట్ కార్యాలయం దేశంలోనే అత్యధిక పాస్‌పోర్టులు జారీచేయడంతో పాటు ఉన్నత ప్రమాణాలు పాటించినందుకు ఐ.యస్.ఒ సర్టిఫికెట్ కూడా పొందింది. కంప్యూటరీకరణ మరియు ఆన్ లైన్ దరఖాస్తు విధానాలకు ఆయన హాయాంలోనే శ్రీకారం చుట్టడం జరిగింది. జిల్లాలలో పాస్‌పోర్ట్ మేళాలను కూడా నిర్వహించడం జరిగింది.
నెల్లూరు జిల్లా కావలి మండలంలోని ఓ కుగ్రామానికి చెందిన బాలభాస్కర్ దౌత్యవేత్తగా అంతర్జాతీయ స్ధాయిలో రాణిస్తున్నారు. ఆయనకు భార్య మరియు ఇద్దరు పిల్లలున్నారు. మైక్రోసాఫ్ట్ ఆఫీసు సర్టిఫికేషన్ లో ప్రపంచంలో అతి పిన్న వయస్కుడుగా ఆరేళ్ళ వయసులో ఆయన కొడుకు అనుదీప్ రికార్డు సృష్టించాడు.












Click it and Unblock the Notifications