న్యూజెర్సీ: ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కుటుంబానికి న్యూజెర్సీలోని ప్రవాసాంధ్రులు సానుభూతి తెలియజేశారు. రోడ్డు ప్రమాదంలో ఆయన కుమారుడు కోట ప్రసాద్ మరణించాడన్న వార్త తమను ఎంతగానో కలిచివేసిందని ఓ ప్రకటనలో తెలిపారు. అమెరికా వచ్చినప్పుడల్లా న్యూజెర్సీలోని తెలుగు కుటుంబాలతో కోట సన్నిహితంగా ఉండేవారని అలాంటి మంచి వ్యక్తికి విధి కోలుకోలేని దెబ్బతీసిందని విచారం వ్యక్తం చేశారు.
కోట కుమారుడు ప్రసాద్ అకాల మరణంపై మీడియా బాగా కవర్ చేసింది. కోట శ్రీనివాసరావుకు ఉన్న సంబంధాల రీత్యా వివిఐపిలు ఆయనను పరామర్శించారు.