అట్లాంటాలో ఎన్నారైల 'ఆటా రోజు'

ATA day in Atlanta
అట్లాంటా విభాగపు అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా), పన్నెండవ ఆటా కన్వెన్షన్ సంయుక్తంగా నిర్వహించిన అట్లాంటా 'ఆటా రోజు" వేడుకలు నవంబర్ 5వ తేదీ సాయంత్రం సాయి మురళి రెస్టారెంట్లో ఎంతో కనుల విందుగా జరిగాయి. వేడుకలకు వచ్చినవారికి కరుణ్ ఎసిరెడ్డి (కన్వీనర్, పన్నెండవ ఆటా కన్వెన్షన్) స్వాగతం పలికారు. ఈ వేడుకలు కరుణాకర్ ఏసిరెడ్డి, డా. జగన్ మోహన్ రావు (కో ఆర్డినేటర్, పన్నెండవ ఆటా కన్వెన్షన్ 2012 ), విక్రం సూదిని, ప్రశీల్ గూకంటి (అట్లాంట ఆటా కోఆర్డినేటర్) పర్యవేక్షణలో జరిగాయి. దాదాపు 500లకు పైగా తెలుగువారు తమ కుటుంభ సభ్యులతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. యేటా ఈ ఆటా రోజు జరుపుకోడం ఆటా వారి ఆనవాయితే అయినా ఈ సంవత్సరం వేడుకల్లో దాతలను సత్కరించారు.

అట్లాంటా ప్రాంతంలో ఇప్పటివరకు దాదాపు $350,000 హామీ రూపకంగా విరాళాలు సేకరించారు. అందులో ఎక్కువ మొత్తంలో ($25,000) విరాళాలు ప్రకటించిన మహా దాతలు ఎస్పీ రెడ్డి (eGenious Consulting), మురళి సజ్జ, ప్రమోద్ సజ్జ (Paramount Consulting), మురళి రెడ్డి, దేవేందర్ రెడ్డి (Charter Global). వచ్చే ఏడాది జరగబోయే పన్నెండవ ఆటా కన్వెన్షన్ నిర్వహణకు కావాల్సిన ఆర్థిక వనరులను అందజేయడంలో చేయూత నిచ్చిన దాతలకు పేరు పేరున కృతఙ్ఞతలు అందజేస్తూ కరుణ్ ఎసిరెడ్డి, దాతలు ఇంకా ముందుకు రావాలని రాబోయే పన్నెండవ ఆటా కన్వెన్షన్ కనివినని రీతిలో జరుపుకోడానికి ఆర్థిక సహాయం అందజేయాలని కోరారు. డా. శ్రీని గంగసాని, చేర్ పర్సన్ ఫండ్ రేజింగ్ కమేటి, మనోహర్ కాసేట్టి (Co Chair Fundraising Committee), శేషగిరి రావు మండవ (Chair, Corporate Committee) అందరి నుండి హామీలు పొందడం గమనార్హం.

విందు ఏర్పాట్లు ఘనంగా చేయడమే కాక వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాన్ని సత్య కర్నాటి (Cultural Committee) మార్గనిర్దేశకత్వంలో నిర్వహించారు. ఒకే ఒక తెలుగు వాడు ఎక్కడ తెలుగువారి వేడుకలు జరిగిన అట్లాంటాలో తన DJతో పాటుగా మధురమైన సంగీతాన్ని అందించే రాం దుర్వాసుల ఇంకా సీనీ సంగీత దర్శకులు రఘు కుంచె, సీనీ గాయకురాలు విజయ లక్ష్మిలతో పాటుగా స్థానిక కళాకారులు తమ గాన మాధూర్యాన్ని అందించి ప్రేక్షకుల్ని రాసోల్లాసంలో ముంచెత్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+