న్యూయార్క్‌లో ఆటా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

భారతదేశానికి చెందిన పిల్లలల్ో భారత సంప్రదాయాలపై చైతన్యం కలిగించాల్సిన అవసరం గురించి ఆటా అధ్యక్షుడు డాక్టర్ రాజేందర్ జిన్నా మాట్లాడారు. వచ్చే ఏడాది జులై 6,7,8 తేదీల్లో అట్లాంటాలో జరిగే 12వ ఆటా సమావేశాలను, యువజన సదస్సును విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఆరోగ్య చైతన్యం, వైద్య విద్య రంగాల్లో తమ సహకారం అందించడానికి వడ్డేపల్లి కృష్ణ, ఎఎపిఐ ప్రెసిడెంట్ డాక్టర్ సునీత కనుమూరి ముందుకు వచ్చారు. అక్టోబర్ 9వ తేదీన న్యూయార్కులో జరిగే ఆటా దసరా వేడుకల గురించి బల్వంత్ కొమ్మిడి వివరించారు. డాక్టర్ శ్రీనివాస రెడ్డి కమ్యూనిటీ లీడర్ల గురించి చెప్పారు.












Click it and Unblock the Notifications