ఆస్ట్రేలియాలో బతుకమ్మ పండుగ

ఉపాధ్యక్షురాలు కరుణ, సిడ్నిలో గత ఆరు సంవత్సరాలుగ జరుగుతున్న తెలంగాణ రాష్త్ర పోరాట కార్యక్రమాలు వివరించారు. ఉప కార్యదర్షి సుజాత, ప్రత్యేక రాష్ట్రం కోసం 650 మంది చేసిన ప్రాణత్యాగాలు ఇక ఆగాలని కోరారు.190 మంది తెలంగాణ ప్రజలు సకల జనుల సమ్మెకు మద్దతుగా పండుగను జరుపుకున్నారని ఫోరం మీడియా ప్రతినిధి వినోద్ రెడ్ది ఏలేటి తెలిపారు. ఫోరం మెంబర్ రాము గుమ్మడవల్లి, ప్రసాద్ రాగిపాణి బోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు.
అధ్యక్షుడు రవికాంత్, కార్యదర్షి సోమేశ్వర్ త్వరలో కాన్ బెర్రాలో భారత రాయబార కార్యలయం ముందు జరిగే నిరసన కార్య క్రమాలకు తెలంగాణ ప్రజలు తరలి రావాలని కోరారు. సాయంత్రం బతుకమ్మ ను పర్రమట్ట చెరువులో నిమజ్జనం చేశారు. తెలంగాణ రైతులకు కరెంట్ రావాలని తెలంగాణ రాష్ట్రం సాకరం కావాలని బతుకమ్మను వేడుకున్నారు.












Click it and Unblock the Notifications