శ్రీకృష్ణపై తెలంగాణ ఎన్నారైల గుర్రు

తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలకు తెలంగాణ ఆకాంక్ష చేరిందని, ఆ వర్గాలన్నీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుకుంటున్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప మరేదీ తెలంగాణ ప్రజలకు అంగీకారం కాదని అన్నారు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ ప్రజల నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉండిందని వారు అభిప్రాయపడ్డారు. కమిటీ తెలంగాణ ప్రజలను, వారి ఆకాంక్షను పూర్తిగా విస్మరించిందని, తద్వారా ప్రభుత్వాన్ని కూడా తప్పుదోవ పట్టించిందని వారన్నారు. అది కాలయాపన కమిటీ మాత్రమేనని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో దానికి ఏ విధమైన విలువ లేదని విమర్శించారు.
ఉద్యోగాలు పోవడం, హైదరాబాదులో ఐటి పరిశ్రమ ప్రభావంపై చేసిన విశ్లేషణలు కమిటీ తీరు ఎంత తప్పుడు పద్ధతుల్లో సాగిందో తెలియజేస్తాయని వారు చెప్పారు. హైదరాబాదులో పరిశ్రమ పెరుగతోందనే విషయం ఐటి పరిశ్రమ నివేదికలు చూస్తే తెలుస్తుందని వారన్నారు. 2010 నవంబర్‌లో గూగుల్ చెప్పిన విషయాలు చూస్తే శ్రీకృష్ణ కమిటీ నివేదిక తప్పుల తడక అని తెలుస్తుందని వారన్నారు. తమకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప మరేదీ అంగీకారం కాదనే తెలంగాణ ప్రజల వెనక తాము ఉంటామని వారు స్పష్టం చేశఆరు.












Click it and Unblock the Notifications