అమెరికాలో కొండవీడు కోట గురించి..

మధ్యయుగంలోని సాంస్కృతిక వైభవానికి, చారిత్రక సందర్భానికి ప్రతీక అయిన కొండవీడు కోటను ప్రాచుర్యంలోకి తమకు సహకరించాలని శివా రెడ్డి వారిని కోరారు. దీన్ని ప్రాచుర్యంలోకి తేవడానికి శివా రెడ్డి 2004 నుంచి కృషి చేస్తున్నారు. దేవాదాయ శాఖ మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి సహకారంతో ఆయన కొండవీడు కోటపై ఓ డాక్యుమెంటరీని కూడా నిర్మించారు.
శివారెడ్డికి సహకారం అందించేందుకు ఆటా ముందుకు వచ్చింది. కొండవీడు కోట అమెరికాలోని తెలుగు ఎన్నారైల్లో ప్రాచుర్యంలో ఉందని ఆటా తెలిపింది. కొండవీడు గురించి తమ తదుపరి మ్యాగజైన్‌లో వార్తాకథనాన్ని ప్రచురిస్తామని తెలిపింది. ఆటా, టిఎజిసి సభ్యులు కొండవీడు కోటను ప్రాచుర్యంలోకి తేవడానికి కృషి చేస్తారని చెప్పింది.












Click it and Unblock the Notifications