భార్యపై భౌతిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్‌వర్మకు దౌత్యవేత్త హోదాలో లభిస్తున్న 'మినహాయింపుల'ను రద్దు చేయాలని భారత్ ను కోరినట్లు బ్రిటన్ తెలిపింది. తమ దేశంలో పనిచేసే దౌత్యవేత్తలు చట్టాలను అతిక్రమించడాన్ని ఎంతమాత్రం ఉపేక్షించమని బ్రిటన్ విదేశీ వ్యవహారాల ప్రతినిధి స్పష్టంచేశారు. వర్మ వ్యవహారంపై బ్రిటన్ అధికారులు భారత రాయబార కార్యాలయ సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మినహాయింపులు రద్దు చేయాలని లేకుంటే.. బ్రిటన్ నుంచి బదిలీ చేసి, భారత చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆ దేశ అధికారులు భారత్ ను కోరినట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది. అయితే, బదిలీ చేసేందుకే భారత్ మొగ్గుచూపినట్లు సమాచారం.