యుఏఈలో భారతీయ కుటుంబం ఆత్మహత్య

ఈ భారతీయ కుటుంబం నివసిస్తున్న ఇంటి దగ్గర నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. భార్యా, భర్తలు వేరు వేరు గదుల్లో ఉరేసుకొని చనిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. ఎనిమిదేళ్ల వారి కూతురు కూడా మరో గదిలో శవమై కనిపించింది. భర్త వయస్సు 44, భార్య వయస్సు 31 ఉంటుందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. అయితే వీరు ఆర్థిక సమస్యలతోనే బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారకణకు వచ్చినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications