అమెరికాలో కన్నాభిరాన్ సంస్మరణ

ప్రభుత్వ దుర్మార్గాలను ప్రశ్నించి, పోలీసు దౌర్జన్యాలను నిలదీసి, మానవహక్కుల ఉద్యమాన్ని నిర్మించటం లో కన్నాభీరాన్ కీలకపాత్ర వహించారని సాజీ గోపాల్ ఆ ప్రకటనలో అన్నారు. ఆయన ప్రకటన ఇలా ఉంది - పౌరహక్కుల ఉద్యమంలో 50 సంవత్సరాలు నిరంతరం పోరాడుతూ, ప్రజాస్వామిక హక్కులు, భావప్రకటనా స్వేచ్ఛ కాపాడుతూ, అణగారిన వర్గాల గొంతుక అయ్యారు. ప్రభుత్వ నిర్భంధాన్ని సవాళ్ళు చేస్తూ కోర్టులలో 600 రిట్ పెటిషన్లు వేసారు. కళ్ళ ముందు జరిగే అన్యాయాలను ప్రశ్నించటం, న్యాయస్థానాలలో ఎండగట్టడం ద్వారా మానవహక్కుల భావజాలన్ని ఆచరణాత్మకంగా విస్తరించారు.
సాజీ గోపాల్ బుర్రా రాములు గురించి ఇలా అన్నారు - వరంగల్ ప్రజాస్వామ విప్లవ విదార్ధి ఉద్యమాలనుండి మానవహక్కుల నాయకుడిగా బుర్రా రాములు ప్రస్థానం చేసారు. ప్రభుత్వ నిర్భంధాన్ని ఎదుర్కొంటూ, క్లిష్ట పరిస్థితులలో వరంగల్ జిల్లాలో హక్కుల ఉద్యమంలో బుర్రా రాములు కీలక పాత్రను పోషించారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో అర్ధశాస్త్రంలో ప్రొఫెసరు గా పనిచేస్తూ, చుట్టూ జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటిస్తూ, బూటకపు ఎన్ కౌంటర్లను వ్యతిరేకిస్తూ, సమాజాన్ని చదువుతూ, మానవహక్కుల కోసం నిరంతరం పోరాడారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఒక హక్కుల ఉద్యమం గా తలచి వరంగల్ జిల్లాలో పల్లె పల్లె తిరిగి మమేకమయ్యారు.












Click it and Unblock the Notifications