న్యూజెర్సీలో బతుకమ్మ పండుగ

మధ్యాహ్న భోజనం తర్వాత పిల్లలకు, మహిళలకు క్రీడాపోటీలు జరిగాయి. బతుకమ్మ ఆట సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైంది. తీరొక్క రంగుల సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పాటలతో మహిళలు ఆడుతుంటే పెద్దలకు తమ స్వదేశంలోని స్వగ్రామంలో బతుకమ్మ జ్ఝాపకాలు మెరిశాయి. గోరటి ఎంకన్న జానపద గేయాలు, బతుకమ్మ పాటలు ఆలపించారు. రెండు గంటల పాటు ఆడిన తర్వాత బతుకమ్మలను సంప్రదాయ పద్ధతిలో రారిటన్ సరస్సులో నిమజ్జనం చేశారు.
ప్రముఖ రచయిత వడ్డేపల్లి కృష్ణ బతుకమ్మ ప్రాధాన్యాన్ని వివరించారు. ఉపేంద్ర చివుకుల బతుమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి హాజరైనవారు జయశంకర్‌కు నివాళులు అర్పించారు. పెద్ద బతుకమ్మ, ఉత్తమ బతుకమ్మ అవార్డులను గోరటి వెంకన్న ప్రీతిరెడ్డి పాతూరుకు, సురేఖ ఎర్రంకు, శైలజ తాడిశెట్టికి అందించారు. రవి తోట, ప్రభాకర్ రెడ్డి చేనేపల్లి, భగవాన్ రెడ్డి పింగళి, ప్రవీణ్ రావు మక్నూరు, బలవంతరెడ్డి కొమ్మిడి, నరేందర్ రెడ్డి యాశా, దామోదర్ గేదెల, వెంకట్ గోరంటి, వెంకటేశ్వర రావు పొన్నమనేని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రమేష్ మాగింట కార్యక్రమానికి హాజరైనవారికి కృతజ్జతలు తెలిపారు.
కిశోర్ భూపతి, రమేష్ మాగంటి, రాజం చిలుక, రవి పెద్ది, సంతోష్ రెడ్డి పాతూరు, శ్రీకాంత్ గౌడ్ అక్కపల్లి, మహేష్ పొగాకు, శ్రీకుమార్ తోకల, శశాంక్ నాగుల, గురునాథం ఆలంపల్లి, మోహన్ రెడ్డి దేశిడి, వెంకట్ నల్లా, ఇంద్రసేనారెడ్డి తూడి, శ్రీనివాస్ గంగోని, భాస్కర్ భూపతి వాలంటీర్లుగా వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.












Click it and Unblock the Notifications