భార్యను హతమార్చిన ఎన్నారై టెక్కీ అరెస్టు!

వివరాల్లోకి వెళితే, ఎన్ ఆర్ ఐ గణేశ్ శంకర్ మిశ్రా, అతని తండ్రి దేవదత్ మిశ్రా, తల్లి సులక్షణ మిశ్రా, సోదరి మీనా ద్వివేది లను హత్యా అభియోగంపై పోలీసులు అరెస్టు చేశారు.
జూలై 23న గణేష్, అతని భార్య అంశూల్ వారి ఇద్దరు పిల్లలు అమెరికానుండి ఇండియా కు వచ్చారు. జూలై 27న అంశూల్ ఆమె ఇంట్లో హత్య చేయబడింది. అయితే, గణేష్ అతని కుటుంబం కలిసి ఈ హత్య ఒక దోపిడీ సంఘటనలో జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే, పోలీస్ దర్యాప్తులో వారే మరో ఇద్దరు వ్యక్తుల సహాయంతో ఈ హత్య చేసినట్లు వెల్లడైంది. సహాయం చేసిన వ్యక్తులకు చెరి ఒక్కరికి రూ. 2.5 లక్షల వరకు ముట్ట చెప్పినట్లుగా కూడా వెల్లడైంది. రాహుల్ తివారి, ఓం చౌదరి అనే ఈ ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications