అన్నా హాజరే విజయంపై ఎన్నారైల సంబరాలు

తాము నిర్వహించిన కార్యక్రమాలను పిఎఫ్ఎల్ ప్రాజెక్ట్స్ ఉపాధ్యక్షుడు జవహర్ కంభంపాటి గుర్తు చేశారు. జయప్రకాష్ నారాయణ, కిరణ్ బేడీ, అరవింద్ కేజ్రివాల్, తదితరులు తమను ప్రోత్సహించిట్లు ఆయన చెప్పారు. తాము జన్‌లోక్‌పాల్ బిల్లులోని ప్రతి అంశాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేశామని పిఎఫ్ఎల్ అట్లాంటా చాప్టర్ అధ్యక్షుడు రామగోపాల్ మాదారపు చెప్పారు. నల్లధనానికి వ్యతిరేకంగా యోగా గురు రామ్‌దేవ్ చేస్తున్న పోరాటాన్ని బలపరచాలని హూస్టన్‌కు చెందిన రాఘవ సోలిపురం కోరారు. లాస్ ఏంజిల్స్‌కు చెందిన శ్రీకాంత్ కొచ్చర్లకోట అన్నా దీక్షపై ఎప్పటికప్పుడు వివరిస్తూ వచ్చారు. పిఎఫ్ఎల్ ఉపాధ్యక్షుడు దినేష్ పగడాల - అన్నా హజారే ఎన్నికల సంస్కరణలపై మాట్లాడడాన్ని గుర్తు చేశారు. శ్రీకాంత్ కూడా మాట్లాడారు.












Click it and Unblock the Notifications