తెలంగాణపై 19న ఎన్నారైల ప్రదర్శన

NRI
పీపుల్ ఫర్ లోక్ సత్తా, ఎన్నారైల ఆధ్వర్యంలో లాస్ ఏంజలీస్ లోని తెలుగువారందరూ తెలంగాణ సమస్యని త్వరితగతిన పరిష్కరించమని భారత సర్కారుని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే శనివారంనాడు నవంబర్ 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాస్ ఏంజలీస్ నగరంలోని, ఎన్నారైలు అధికంగా వుండే అర్టీసియా ప్రాంతంలో ఒక భారీ ప్రదర్శన తలపెట్టారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సమస్యకు పరిష్కారం రాక గత రెండు సంవత్స్తారాలుగా ప్రాంతీయోద్వేగాలు పెరగటం, రాష్ట్ర అభివృద్ది కుంటుపడటం, సకల జనుల సమ్మె, ఆత్మహత్యలు, సామాన్య ప్రజలు ఇబ్బందులు గురియవ్వటం చూస్తూనే వున్నామని, అయినా అధికార పక్షం, రాష్ట్ర, దేశ ప్రభుత్వాలు సమస్యని పరిష్కరించే దిశగా స్పష్టమైన అడుగులు వేయటం లేదని, ఈ సమస్యతో రాష్ట్రంలో పరిపాలన కూడా కుంటుపడిపోయిందని వారు భావిస్తున్నారు.

2009 డిసెంబర్ 9న, 23న పరస్పర విరుద్ద ప్రకటనలతో ప్రజలని తప్పుదోవ పట్టించినట్లు కాకుండా, అందరికి న్యాయం జరిగే పరిష్కారం చూపించి, దాని మీద గట్టిగా నిలబడాలని లాస్ ఏంజలీస్‌లోని తెలుగువారు కోరుతున్నారు. ప్రభుత్వం వారి తీర్పుని ప్రకటించేటప్పుడు దాని వెనక వున్న హేతుబద్ధమైన ఆలోచనను, ఐక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు కలిగిన, అలాగే విడిపోతే సీమాంద్ర ప్రజలకు కలిగే సాధకబాధకలు, కష్టనష్టాలేవి అని అన్నీ ప్రాంతాల వారికి అర్ధమయ్యేట్టు వివరించమని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు మరిన్ని వివరాల కోసం ఇంటర్నెట్‌లో tinyurl.com/TeluguWalk సందర్శించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+