తెలంగాణ సమ్మెకు ఎన్నారైల సంఘీభావం

Telangana
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగుతున్న సకల జనుల సమ్మెకు ఎన్నారైలు తమ సంఘీభావం ప్రకటించారు. ఈ మేరకు వారు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన ఇలా సాగింది-

సింగరేణి, ఆర్టీసీ కార్మికులు, ఉస్మానియా, కాకతీయ విద్యార్ధులు, కరీంనగర్ రైతు కూలీలు, ఆదిలాబాద్ ఆదివాసులు, లాయర్లు, దళితులు, ఎన్జీవోల నాయకత్వంలో జరుగుతున్న సకలజనుల సమ్మెకు పూర్తిగా సంఘీభావం తెలుపుతున్నాం. తెలంగాణ జేఏసీ నాయకుడు ప్రొ.కోదండరామ్, తెలంగాణ ప్రజాప్రంటు నాయకుడు గద్దర్, మరియు విమలక్క నాయకత్వంలో సాగుతున్న తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నాం. కార్మికులు, ఎన్జీవోలు ధైర్యంగా తమ ఉద్యోగాలను సైతం పణంగా పెట్టి సమ్మెలో పాల్గొంటున్నారు. ఇప్పటిదాకా ఆర్ధిక డిమాండ్ల పైన సమ్మెలు చేసిన కార్మికులు, ఇప్పుడు ఒక రాజకీయ డిమాండు పైన ఉద్యమించటం ఒక మంచి పరిణామంగా భావించాలి. కేంద్రం, రాష్ట్రంలోని కాంగ్రెసు ప్రభుత్వాలు సమస్యను రాజకీయంగా పరిష్కరించకుండా, పోలీసు, పారామిలటరీ, గ్రేహేండ్స్ బలగాలతో ప్రజా ఉద్యమాలను అణచివేస్తున్నాయి. ఉద్యోగస్థులు పైన ఎస్మా లాంటి నల్ల చట్టాలను ప్రయోగిస్తామని బెదిరిస్తున్నాయి.

నీటి వనరులు, ఆర్ధిక వనరులు, ఉద్యోగాలు, అభివృద్ధిలో సమ భాగం కావాలనే న్యాయమైన డిమాండ్లతో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నది. తెలంగాణ పల్లెలలో కోట్లాది జనం “ప్రజా తెలంగాణ" కోరుకుంటున్నారు. కొత్త రాష్ట్రం ఏర్పాటుతో తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు. ఓట్లు వేయించుకొని గద్దె కెక్కిన నాయకులు సమస్యలను రాజకీయంగా పరిష్కరించటం లో విఫలం అయినప్పుడు, ప్రజలకు ఉద్యమించటమే తప్ప మార్గం లేదు. తెలంగాణ ప్రాంతానికి చెందిన చాలామంది అసెంబ్లీ, పార్లమెంటు సభ్యులు తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనకుండా, రాజీనామా డ్రామాలు, నోటి మాటలు, పత్రికా ప్రకటనలకు పరిమితం అవటం విచారకరమైన అంశం.

త్యాగాలు లేకుండా తెలంగాణా రాదు, నొప్పి లేకుండా సర్కారు స్పందించదు. తెలంగాణ ప్రజలు ఉద్యమించి ప్రజాస్వామికంగా సహాయ నిరాకరణ, ఆర్ధిక దిగ్బందనం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ వచ్చే వరకు సర్కారు కు పన్నులు, బిల్లులు, భూమి రిజిస్ట్రేషన్లు, సారా లిక్కరు వ్యాపారాలు, రవాణాలు బంద్ చేసి ఆర్ధిక దిగ్బంధనం చేసి, ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని మనవిచేస్తున్నాం. కొన్ని భూస్వామ్య దోపిడి శక్తులు, మతోన్మాద, అరాచక శక్తులు తెలంగాణ ఉద్యమాన్ని బదనాం చేసి, నష్టం చేస్తున్నాయి. 2014 ఎన్నికల వరకు తెలంగాణ సమస్యను సాగదీయాలని, తెలంగాణ ముసుగులో దోపిడి దొరల రాజ్యం తేవాలని, మతోన్మాదం రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. జనం అప్రమత్తంగా వుండాలె. తెలంగాణ ఉద్యమంలోని అప్రజాస్వామిక ధోరణులను ఓడించాలె. తెలంగాణ ప్రజలకు రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రజలతో ఎట్లాంటి పేచీ లేదు. బతుకు తెరువు కోసం తెలంగాణ కొచ్చిన రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర మరియు ఇతర ప్రాంతాల ప్రజలను కాపాడుకుంటూ, తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవలె. “బయటోడు మోసం చేస్తే ఊరి అవతలకు తరిమి కొడతాం, ఇంట్లోడు మోసం చేస్తే పాతర ఏస్తం" అన్న ప్రజాకవి కాళోజి మాటలను యాదిచేసుకొని తెలంగాణ వనరులను దోచుకుంటున్న దోపిడి దొరలను ఓడించాలి.

సామాజిక న్యాయం జరిగే, ప్రజాస్వామిక విలువలు విల్లసిల్లే, మానవహక్కులు గౌరవించబడే, వెనకబడిన, దళిత వర్గాలకు రాజ్యాధికారం లో సమభాగం దక్కే “ప్రజా తెలంగాణ" ను పూర్తిగా సమర్థిస్తూ, తెలంగాణా ఉద్యమానికి సంఘీభావం తెలుపుతున్నాం.

ప్రకటనపై సంతకాలు చేసిన ఎన్నారైలు -

సాజీ గోపాల్, ఇందూ రెడ్డి జి., మనోహర్, ధనరాజ్, శశికాంత్ కనపర్తి, జి. రవి, అశ్విన్, చంద్ర బండారు, సతీష్ జనుంపల్లి, సంతోష్ పున్నం, జానకిరామ్ మందాడి, మహేష్ ఆదిభట్ల, అశోక్ కొండాల, సునీల్ ఆందోల్, ప్రవీన్ ఎకంటి, స్వరూప్ కుండూరు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+