విదేశీ అఫైర్స్ మంత్రికి పిఎఫ్ఎల్ వినతి

ఎన్నారైలు స్వయంగా వచ్చి ఎన్నికల్లో ఓటు వేయడం భౌతికంగా సాధ్యం కాదని, పోస్టల్ బ్యాలెట్, ఎలక్ట్రానిక్ వోటింగ్ వంటి ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా ఎన్నారైలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని వారు రవిని కోరారు. 25 దేశాల్లోని భారతీయుల సమస్యపై వారు చెప్పిన విషయాలను రవి సావధానంగా విన్నారు. ఎన్నికల కమిషన్ అధికారులకు కూడా పిఎఫ్ఎల్ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు.
అవినీతికి వ్యతిరేకంగా జరిపిన సంతకాల సేకరణతో ఓ వినతిపత్రాన్ని వారు ప్రధాని మన్మోహన్ సింగ్ సీనియర్ సలహాదారు శాం పిట్రోడాకు అందజేశారు. అవినీతి నిరోధానికి స్వతంత్ర యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరారు.












Click it and Unblock the Notifications