• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమెరికాలో ఎన్నారైల వాక్

By Pratap
|
Google Oneindia TeluguNews
PFL Walk
భారత జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా అమెరికాలోని ప్రవాస భారతీయులు అవినీతికి వ్యతిరేకంగా మార్చ్ చేశారు. వేలాది మంది పౌరులు ఈ మార్చ్‌లో పాల్గొన్నారు. పౌరులు, వివిధ సామాజిక సంఘాలు, ఎన్‌పిఒ ప్రతినిధులు ఈ మార్చ్‌లో పాల్గొన్నారు. పీపుల్స్ ఫోరం ఫర్ లోకసత్తా (పిఎఫ్ఎల్) ఆధ్వర్యంలో ఈ 10 మైళ్ల మార్చ్ కార్యక్రమం జరిగింది. అవినీతి రాజకీయ నాయకులను, అధికారులను వేగంగా ప్రాసిక్యూట్ చేయడానికి అవినీతి వ్యతిరేక చట్టాలను పటిష్టం చేయాలని, జాతీయ, రాష్ట్ర స్థాయిలో అవినీతి నిరోధ యంత్రాంగాలను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.

పిఎఫ్ఎల్ లాస్ ఏంజెల్స్‌లో ఈ మార్చ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆర్టీసియా ఏరియాలో ఈ పది మైళ్ల నడక సాగింది. కుంభకోణాల్లో భారీ మొత్తంలో సొమ్ము పోవడం తనకు బాధగా ఉందని, ఇంతగా నష్టం జరుగుతుంటే మౌనంగా ఎలా ఉండగలనని మార్చ్‌లో పాల్గొన్న అమిత్ అన్నారు. నిరంతరాయంగా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఈ మార్చ్ తెలియజేస్తోందని శ్రీహరి అట్లూరి అన్నారు. హైదరాబాదులో అదే రోజు యూత్ ఫర్ బెట్టర్ ఇండియా పేరుతో పిఎఫ్ఎల్ చాప్టర్ ఆధ్వర్యంలో పద్మభూపతి రాజు తదితరులు మార్చ్ చేపట్టారు. ట్రై వ్యాలీ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని పిఎఫ్ఎల్ హూస్టన్ కాన్సులేట్ జనరల్‌ను పిఎఫ్ఎల్ కోరింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X