తెలుగుసమాజం సారధ్యంలో సంక్రాంతి వేడుకలు సింగపూర్‌లో ఘనంగా జరిగాయి. తెలుగు గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా అరటిచెట్లు, కొబ్బరి, మామిడాకులు, చెరుకుగడలతో వేదికను అందంగా అలంకరించారు. సింగపూర్ తెలుగు సమాజం సభ్యులు పావని కుమార్ సంక్రాంతి పర్వదిన విశిష్టతను సభికులకు తెలిపారు. అనంతరం రామాచారి బృందం సంగీత విభావరి నిర్వహించింది. బాలల ఫ్యాషన్ ప్రదర్శన అందర్ని అలరించింది. సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో గెలిచిన మహిళలకు బహుమతులను అందజేశారు. సంక్రాంతి వేడుకల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు సభ్యులకు సింగపూరు తెలుగు సమాజం అధ్యక్షుడు అరిమిలి రాధాకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.