అమెరికాలో సంక్రాంతి సంబరాలు

NRI
అమెరికాలోని డల్లాస్‌లో తెలుగువారి సంక్రాంతి సంబరాలు వైభవంగా ముగిశాయి. ఈ సంబరాలు సంప్రదాయబద్దంగా జరిగాయి. అమెరికాలో సాహిత్య, సంగీత సంస్కృతీ సంప్రదాయాలకు నిలయమైన టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్‌ నగరంలో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఈ ఏడాది వైభవంగా నిర్వహిచారు. ఈ కార్యక్రమానికి టాంటెక్స్ కోశాధికారి, సాంస్కృతిక సమితి ఆగ్రాసనాధిపతి డాక్టర్ సుబ్బారావు పొన్నూరు అధ్యక్షత వహించారు.

చలికాలం కావడంతో మధ్యాహ్నం భోజనానంతరం కార్యక్రమం ఏర్పాటు చేశారు. లడ్డు, పొంగలి, మసాల వడలు, తదితర వంటలతో రుచి ప్యాలెస్ భోజనశాలవారు బంతి భోజనం వడ్డించారు. పోషక దాతలు, వివిధ వ్యాపార సంస్థల ప్రదర్శనలు సభ్యులకు స్వాగతం పలికాయి. సంక్రాంతి పాటలు, ముగ్గులు, ముచ్చట్లతో పాటు అత్యంత సుందరంగా బొమ్మల కొలువుతో వేదిక సర్వాంగసుందరంగా ముస్తాబైంది.

చిన్నారుల గొబ్బిళ్ల పాటలు, శాస్త్రీయ నృత్యాలు, చిత్ర సంగీత మిశ్రమ నాట్య విన్యాసాల జోరు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాయి. అచ్చ తెలుగు వాతావరణాన్ని అణువణువునా ప్రతిబింబించే పాటకు, తెలుగింటి ఆదరాలను, వాటిలోని విశిష్టతనూ ఎంతో అందంగా చూపించే సంగీత, నృత్య దృశ్యాలకు పెద్ద పీట వేశారు. స్థానిక కొపిల్ మాధ్యమ పాఠశాల ఆడిటోరియంలో దాదాపు 800 మందికి పైగా హాజరయ్యారు. బుల్లితెర హాస్య కళాకారులు రవి భవిరి, హరిబాబు దోర్నాల హైదరాబాదు నుంచి సంక్రాంతి సంబరాలకు విచ్చేసి రాజకీయ హాస్యానుకరమ, హాస్య సన్నివేశాలతో సభను ఆకట్టుకున్నారు.

టాంటెక్స్ తక్షణ పూర్వాధ్యక్షుడు చంద్ర కన్నెగంటి సహకారం అందించిన సభ్యులకు, మిత్రులకు, పోషకదాతలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగువారందరూ కలిసి మెలిసి చురుగ్గా పాల్గొని కార్యక్రమాలు నిర్వహించినప్పుడు సంస్థకు గౌరవం పెరుగుతుందని ఆయన అన్నారు. ఎన్ఎంఎస్ రెడ్డి, రీత చమ్మన్న, శ్రీధర్ కోడెల సంయుక్తంగా కన్నెగంటి దంపతులకు జ్ఞాపిక అందజేశారు. టాంటెక్స్ అధ్యక్షుడు ఎన్ఎంఎస్ రెడ్డి - వివిధ హోదాలో సంస్థకు దశాబ్దం పాటు సేవలందించిన చంద్రకు, కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. 2011 కార్యవర్గ సభ్యులను సభకు పరిచయం చేశారు. జులైలో జరిగే సంస్థ రజతోత్సవ కార్యక్రమాలకు అవసరమైన సహాయం చేయాలని ఆయన కోరారు.

పాలక మండలి అధిపతి శ్రీధర్ కోడెల నూతన సభ్యులను సభకు పరిచయం చేశారు. సంస్థకు సేవ చేసిన పాలక మండలి సభ్యులు సత్యన్ కళ్యాణదుర్గ్, రవీందతి పండిటి, ఎన్నికల సమితి అగ్రాసనాధిపతి రావు కల్వలలను సత్కరించారు. ఉత్తారాధ్యక్షులు రీత దమ్మన్న, ఉపాధ్యక్షుడు సురేన్ మండువ, కార్యదర్శి విజయమోహన్ కాకర్ల, సంయుక్త కార్యదర్శి నరసింహారెడ్డి ఉరిమిడి, సంయుక్క కోశాధికారి రామకృష్ణ కోరాడ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాలు కార్యక్రమ సమన్వయకర్త సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ సహకారం అందించిన వివిధ సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+