వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డల్లాస్‌లో తెలుగువారి వాలీబాల్

By Pratap
|
Google Oneindia TeluguNews

NRI
తెలుగు ఎన్నారై సంస్థలు తెలుగు ఆసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (టాంటెక్స్), ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఐఎఎన్‌టి) సంయుక్తంగా ఇటీవల రెండు రోజుల డల్లాస్‌లో వాలీబాల్ పోటీలు నిర్వహించాయి. ఈ పోటీలు ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. టాంటెక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ రామకృష్ణ కోరాడ నేతృత్వంలో ఈ పోటీలు జరిగాయి. డల్లాస్ - ఫోర్ట్ వర్త్ నుంచి 16 జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. శనివారం ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత పోటీల ప్రారంభానికి దాదాపు 200 మంది హాజరయ్యారు. టాంటెక్స్ అధ్యక్షుడు ఎన్ఎంఎస్ రెడ్డి, ఐఎఎన్‌టి అధ్యక్షుడు జాక్ గోద్వానీ, ఐఎఎన్‌టి ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి కోర్సపాటి పోటీలను ప్రారంభించారు. మొదటి రోజు పోటీలు ముగిసే సమయానికి ఎనిమిది జట్లు రంగంలో నిలిచాయి. రెండో రోజు క్వార్టర్ ఫైనల్స్ ప్రారంభమయ్యాయి. టెక్సాస్ చార్జర్స్, బ్లూ లేబుల్ జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. మురళి పల్లబొత్తుల నేతృత్వంలోని బల్కి చంకురా, బాలాజీ మేరెడ్డి, ఎన్ఎంఎస్ రెడ్డి, రాజు చెకూరి, వంశీ నాగల్లతో కూడిన టెక్సాస్ చార్జర్స్ జట్టు రెండో స్థానంలో నిలిచింది.

శేఖర్ బ్రహ్మదేవన నాయకత్వంలోని అభిరామ్ చెరుకు, అంకుర్ శర్మ, నవీన్ మైనేని, రఘు చిట్టిమల్ల, రామారావు మైలా, రవి ఉప్పులూరి, వెంకట్‌లో కూడిన బ్లూ లేబుల్ జట్టు విజయం సాధించి టైటిల్ ‌దక్కించుకుంది. పోటీల్లో పాల్గొన్నవారిని కోరాడ అభినందించారు. టాంటెక్స్‌కు చెదిన అనంత మల్లవరపు, కృష్ణా రెడ్డి ఉప్పలపాటి, రాజేష్ చిలుకూరి, డాక్టర్ నర్సింహా రెడ్డి ఉమ్మడి విజేతలకు ట్రోఫీ అందజేశారు. బ్లూ లేబుల్ జట్టుకు చెందిన అంకుర్ శర్మకు మోస్ట్ వాల్యుయేబుల్ బహుమతి దక్కింది. ఇండికా సాఫ్ట్‌కు చెందిన సుబ్బు దామిరెడ్డి ఆ అవార్డును అందించారు.
ఈవెంట్ కో ఆర్డినేటర్ మహేష్ ఆదిభట్ల పోటీలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

English summary
The first ever indoor volleyball tournament jointly conducted by Telugu Association of North Texas (TANTEX), a non-profit, non-religious organization established in 1986 to preserve, promote and perpetuate the cultural heritage of Telugu speaking people of North Texas and India Association of North Texas (IANT),a non-profit, non-political, non-sectarian organization established in 1962 with the primary purpose to serve the cultural and educational needs of the North Texas Indian community.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X