లండన్‌లో తెలంగాణ సాంస్కృతి ఉత్సవం జరగనుంది. ఈ ఉత్సవం ఈ నెల 17వ తేదీన తెలంగాణ బోనాలతో జరుగుతుంది. ఈ ఉత్సవంలో బిజెపి జాతీయాధ్యక్షుడు నితిన్ గడ్కరీ, జై బోలో తెలంగాణ చిత్రం పేమ్ స్మృతి ఇరానీ పాల్గొంటారు. తెలంగాణ డెవలప్‌మెంట్ యుకె యూరోప్ చాప్టర్ ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. సాంస్కృతిక నృత్యాలు ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. నాయకులతో భేటీ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత పిల్లలకు ఆటల పోటీలు, విజేతలకు బహుమతి ప్రదానం కార్యక్రమాలు ఉంటాయి. తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం యుకె యూరోప్ చాప్టర్ ప్రతినిధి కిరణ్ పసునూరి ఓ ప్రకటనలో కార్యక్రమ వివరాలు అందించారు. తెలంగాణ ఉత్సవాలు 17వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు హన్‌షోలోని లాంప్టన్ స్కూల్లో ప్రారంభమవుతాయి.
Telangana Development Forum cordially invites you to attend the "Telangana Cultural Fest with Bonalu" on Sunday 17th July, Starts 2 PM Sharp Lampton School, Hounslow, London - TW3 4 EP.