ట్రై వ్యాలీ విశ్వవిద్యాలయం విద్యార్థులకు రేడియో ట్యాగ్స్ కట్టడాన్ని భారత్ వ్యతిరేకించిన నేపథ్యంలో ఇద్దరు విద్యార్థులను యుఎస్ డిటెన్షన్ సెంటర్‌లో ఇద్దరిని నిర్బంధించారు. ట్రై వ్యాలీ విశ్వవిద్యాలయానికి చెందిన 18 మంది భారతీయ విద్యార్థులకు రేడియో ట్యాగ్స్ అమర్చినట్లు తెలుస్తోంది. లాంఛనప్రాయమైన అదుపునకు రేడియో ట్యాగ్స్ ప్రత్యామ్నాయమని అమెరికా వాదిస్తోంది. అది దర్యాప్తులో భాగమని కూడా చెబుతోంది. రేడియో ట్యాగ్స్ కట్టడాన్ని అవమానించినందుకు అమెరికా దౌత్యవేత్త క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. రేడియో ట్యాగ్స్ అమర్చడం అమెరికాలో అతి మామాలు వ్యవహారమని హైదరాబాదులోని అమెరికా కాన్సులేట్‌లో ప్రజా వ్యవహారాలను చూసే జులియట్ వుర్ ఓ ప్రముఖ జాతీయ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. జైలులో కూర్చోవడానికి బదులు తమ దేశంలోని సినీ తారలు, సెలిబ్రిటీలు రేడియో ట్యాగ్స్‌ను కోరుకుంటారని ఆయన అన్నారు. భారత ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో మరుక్షణమే ఆయన తన మాట మార్చారు. ఏ భారతీయుడిని కూడా అవమానించే, బాధపెట్టే ఉద్దేశం తనకు లేదని, క్షమాపణలు చెబుతున్నానని ఆయన అన్నారు.