కాలిఫోర్నియాలో వనభోజనాలు

టిసిఎ అధ్యక్షుడు సైదీష్ కుమార్ అజ్జన్ స్వాగతోపన్యాసం చేశారు. భాస్కర్ మద్ది, చక్రి రవడ భోజన పదార్థాలను తగిన రీతిలో ఏర్పాటు చేశారు. మధ్యాహ్న భోజనాల తర్వాత పిల్లలకు, పెద్దలకు ఉమా చింతలపాటి, చంద్రకళ, శారద పాటలు, నాట్య కార్యక్రమాలను నిర్వహించారు. పెద్దలకు, పిల్లలలకు బిక్షం, అర్షద్, శ్రీనివాస రావు వాలీబాల్, పరుగు పందెం, మ్యూజికల్ బాల్, స్పూన్ విత్ మార్బుల్, నీడిల్ విత్ స్ట్రింజ్, టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించారు.
టిసిఎ సభ్యులు మహిపాల్, యుగేందర్, వినోద్ గూడూరి అందరికీ చికెన్ వడ్డించారు. మొక్కజొన్న కంకుల రుచి చూపించారు. విజయ్ చవ్వా, భిక్షం పాలబిందెల, శ్రీనివాస్ గుజ్జా, రాజు యాశాల, గట్టు ప్రసాద్, చక్రి రవడ, భాస్కర్ బెందికల్లు, శ్రీనివాస్ రెడ్డి (బాటా అధ్యక్షుడు), వంశీ, దీనబంధు (సిలికానాంధ్ర అధ్యక్షుడు) తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.












Click it and Unblock the Notifications