కెనడా, అమెరికాల్లో వాసవి జయంతి

Vasavi Jayanthi
వాసవి భక్తులు ప్రపంచవ్యాప్తంగా వాసని జయంతిని జరుపుకుంటున్నారు. అమెరికా, కెనడా, యుకెల్లో వాసవి జయంతి 2011 ఉత్సవాలు ఎప్రిల్ 30వ తేదీన ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు మే 22వ తేదీ వరకు సాగుతాయి. అట్లాంటా, బే ఏరియా బోస్టన్, చార్లోట్, చికాగో, క్లైవిలాండ్, డల్లాస్, డిసి, డెట్రాయిట్, హౌస్టన్, న్యూ జెర్సీ, ఓర్లాండో, రెలియి, సెయింట్ లూయిస్, తాంపా, సియాటిల్‌ల్లో, కెనడా, యుకెల్లోని ప్రధాన నగరాల్లో 30 వేల మందికి పైగా ఈ ఉత్సవాలను నిర్వహించుకుంటున్నారు.

ఎన్నారై వాసవి అసోసియేషన్ ప్రపంచవ్యాప్తంగా ధర్మం, శీలం, అహింస అనే వాసవి సందేశాన్ని ప్రచారం చేస్తోంది. ఎన్నారైవిఎ స్థానిక చాప్టర్, బే ఏరియా విఎస్ఎఫ్, న్యూయార్క్ వాసవి సొసైటీ, రిలైయ్ ట్రయాంగిల్ వాసవి సొసైటీ, హౌస్టన్ విపిఎస్, చికాగో వోనా, వాసవి డెట్రాయిట్ వంటి సంస్థలు అణగారిన వర్గాలకు భారతదేశంలో, ఇతర దేశాల్లో సేవలు అందిస్తోంది.

పెనుగొండ వాసవి క్షేత్ర పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కృష్ణానందపురి స్వామీజి, అఖిల భారత వాసవి పెనుగొండ ట్రస్టు ఆధ్వర్యంలో ఎన్నారైవిఎ వాసవి ఉత్సవాలను ఏటా ప్రపంచవ్యాప్తంగా సమన్వయం చేస్తుంది. వాసవి సందేశాన్ని వినిపించడానికి ఎన్నారైవిఎ వాసవి మఠం భజనలు, ప్రార్థనల ఆల్బం సిడీని విడుదలు చేస్తోంది.

వాసవి ఉత్సవాల కార్యక్రమాలన చిట్టారి పబ్బ సమన్వయం చేస్తున్నారు. చిట్టారి పబ్బకు చిన్ని, కరుణాకర్ చౌడవరపు, రమా జొన్నలగడ్డ, శ్రీని కొనకళ్ల, అనిల్ నార్లా, శామ్ తల్లం, విశ్వనాథ్ జక్కా, మన్నర్, రామ్ బజ్జూరి, శ్రీలత కందగడ్ల, తనుజ్, గౌరీ శంకర్, సతీష్ పాలకుర్తి సహకరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+