విదేశాల్లో ఘనంగా వాసవి జయంతి

జాతీయ స్థాయి వాసవి జయంతి వేడుకలను ఈ ఏడాది ఎన్ఆర్ఐవిఎ అమెరికాలోని 50 నగారాల్లో సమన్వయం చేసింది. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో బే ఏరియా విఎస్ఎఫ్, చికాగో వోనా, న్యూయార్క్ వాసవి సొసైటీ, డెట్రాయిట్ వాసవి వంటి సంస్థలు సమన్వయం చేశాయి. వాసవి సందేశం ధర్మం, శీలం, అహింసలను తెలిపే వాసవి మాత భజనల ఆల్బం సిడిని ఎన్ఆర్ఐవిఎ విడుదల చేసింది. జాయీత స్థాయి వాసవి మాత వేడుకల పూజల్లో పాల్గొన్నవారికి ఇచ్చిన విగ్రహాలను అఖిల భారత వాసవి పెనుగొండ ట్రస్టు అందజేసింది. జాతీయ స్థాయి వాసవి జయంతి వేడుకల్లో పాల్గొన్నవారికి ఎన్ఆర్ఐవిఎ ప్రత్యేకమైన ఏప్యాడ్ అందజేసింది. ఈ ఏడాది వాసవి జయంతి వేడుకలను చిత్తారి పబ్బ సమన్వయం చేశారు.












Click it and Unblock the Notifications