న్యూజెర్సీ రోడ్డు ప్రమాదంలో 4ఏళ్ల బాలుడు మృతి

నాగరాణి, ధ్యానేష్ రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఓ కారు తొలుత నాగరాణిని ఢీకొంది. ఆ తర్వాత ఆమె చేతిలో ఉన్న ధ్యానేష్ అదుపు తప్పి కింద పడ్డాడు. కిందపడిన ధ్యానేష్ మీది నుండి ఆ కారు వెళ్లింది. దీంతో అతడు అక్కడికి అక్కడే మృతి చెందాడు. కారు నడుపుతున్నది ఓ మహిళ అని గుర్తించినట్లు పోలీసులు చెప్పారు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ధ్యానేష్ మృతదేహాన్ని భారత్‌కు తీసుకు వచ్చేందుకు స్థానిక భారత ఎంబసీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళనాడులోని మధురైకి చెందిన బాలాజీ... ఎడిసన్ సంస్థలో ఐటి నిపుణిడిగా పని చేస్తున్నారు.












Click it and Unblock the Notifications