అమెరికా రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ యువతి మృతి

USA
వాషింగ్టన్: న్యూజెర్సీలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మన రాష్ట్రానికి చెందిన ఓ మెడికో అసువులు బాసింది. అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన కారు ప్రమాదంలో హైదరాబాదుకు చెందిన విశ్వజ అనే యువతి మృతి చెందింది. ఇదే ప్రమాదంలో మరో ముగ్గురు గాయపడ్డట్లుగా సమాచారం.

ఈ ప్రమాదం అమెరికా కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున జరిగింది. రాత్రి ఒకటిన్నర గంటల సమయంలో టొయోటా హైల్యాండర్ వాహనంలో విశ్వజ వెళుతున్నారు. ఆ సమయంలో వాహనం అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. వైద్య విద్యను అభ్యసిస్తున్న విశ్వజ వయస్సు 21.

గాయపడిన వారికి న్యూజెర్సీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా వాహనం నడుపుతున్న విద్యార్థిని ఎలాంటి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించలేదని తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి అమెరికాను వణిస్తున్న శాండీ తుఫాను కారణమా మరేదైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+