అమెరికా వరదల్లో ఆంధ్రవాసి

ఇదిలా వుంటే, అమెరికాలోని న్యూయార్క్‌లో తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పడపాటి రాజాచౌదరి మృతి చెందారు. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన రాజా చౌదరి(25) న్యూయార్క్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో గత కొన్ని రోజులుగా పనిచేస్తున్నారు.
ఆదివారం సహచర మిత్రులతో కలిసి ఈతకు వెళ్లిన రాజా ప్రమాదవశాత్తు ఈత కొలనులో పడి మృత్యువాతపడ్డారు. రాజా మరణవార్తతో అద్దంకిలోని కుటుంబ సభ్యులు కన్నీటి సముద్రంలో మునిగిపోయారు.
మరోవైపు, ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అమెరికా నుంచి వచ్చి హైదరాబాదులో ఆత్మహత్య చేసుకున్నాడు. అమెరికాలోని సాన్ డీగో నుంచి అతను ఆదివారం హైదరాబాదులో ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరుకు చెందిన 30 ఏళ్ల టెక్కీ క్యాబ్‌ను అద్దెకు తీసుకుని అందులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. కూకట్‌పల్లిలోని బావమరిది ఇంటికి చేరుకున్న తర్వాత అతను కారులోనే మరణించి ఉండటాన్ని డ్రైవర్ గమనించాడు.












Click it and Unblock the Notifications