ఆత్మహత్యలు వద్దని ఎన్నారైల వినతి

విశ్వాసం కోల్పోవద్దని ఆయన తెలంగాణ యువతను కోరారు. జీవితం అత్యంత విలువైందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేసుకునేందుకు, దాన్ని కళ్లారా చూసేందుకు మనం జీవించి ఉండాలని ఆయన అన్నారు. యువత బంగారు భవిష్యత్తు కోసం తెలంగాణ పెద్దలు, మేధావులు, రాజకీయనాయకులు పోరాడుతున్నట్లు తెలిపారు. ప్రజాస్వామికమైన, నిజాయితీతో కూడిన న్యాయబద్దమైన డిమాండ్ అయినందున తెలంగాణ రాష్ట్ర ఏర్పడి తీరుతుందని ఆయన అన్నారు. ఎవరితోనైనా మాట్లాడాలని అనుకుంటే విద్యార్థులు, యువకులు ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర సామాజిక సైట్ల ద్వారా టిడిఎఫ్ సభ్యులతో మాట్లాడవచ్చునని చెప్పారు.












Click it and Unblock the Notifications