చార్లెట్‌లో ఆటా రోజు వేడుకులు

ఆటా అధ్యక్షులు రాజేందర్ జిన్నా మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయం, సమాజ సేవ మీద తమ సంస్థ చేస్తున్న కృషిని వివరించారు. జులైలో జరగనున్న ఆటా కార్యక్రమానికి రావలసినదిగా వారు అతిధుల౦దరినీ పేరు పేరునా ఆహ్వానించారు. ఇంతవరకూ ఆటా సాధించిన ప్రగతికి తమ హర్షం వ్యక్తం చేశారు. భవిష్యతులో ఆటా ఎన్నో సేవ కార్యక్రమాలు చేపట్టనున్నట్లుగా వారు తెలిపారు.
ఈ కార్యక్రమానికి తమ సంపూర్ణ సహకారన్నందించిన ‘టిఏజిసిఏ', ‘సిటిఏ' సంస్థలకు తమ కృతజ్ఞత వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమ౦ విజయవంతమవడానికి అహర్నిశలూ కృషి చేసిన సంతోష పసుల (ఆటా రీజినల్ కో ఆర్డినేటర్), రఘునాధ కొత్త(ఆటా సావనీర్ చైర్), పురుసోత్తమ గూడె, జయ థక్క, రమణ కొట్టె, సునీత అనుగు, అశోక చందు, శ్రవణ్ కయాటి, నాగ నల్ల, నవీన్ జలగం, భరత్, ఎడ్మ, శ్రీనివాస్ మర్పడ్గ, సంజీవ్ రెడ్డి రవి వెంకట్‌కు తమ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి చార్లెట్ వాస్తవ్యులు, చిన్నారులు గాన నృత్య ప్రదర్శనలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రంలో హాజరైన చార్లెట్ వాస్తవ్యులు సుమారుగా 60,000 డాలర్లు ఆటాకు విరాళాన్ని అందజేశారు.












Click it and Unblock the Notifications