20న సిడ్నీలో బతుకమ్మ పండుగ

సిడ్నీలోని తెలంగాణ , తెలంగాణేతర సోదర సోదరీమణులు భాష, ప్రాంతీయ భేదాలు పక్కన పెట్టి, ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చి ఈ బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి చూపిస్తున్న చొరవ, సిడ్నీ బతుకమ్మ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని తెరవనుందని ఆస్ట్రేలియా తెలంగాణ ఫోరం ప్రతినిధి వినోద్ ఏలేటి ఓ ప్రకటనలో తెలిపారు.
అక్టోబర్ 20వ తేదీన సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు ఉత్సవాలు ప్రారంభమంవుతాయని ఆయన చెప్పారు. బతుకమ్మ, కోలాటాలకి ఎక్కువ సమయం కేటాయించే విధంగా సమయానికి రావాలని ఆయన తెలుగు ఎన్నారైలను కోరారు.
తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి తెలిచేయడంలో జరుగుతున్న ఈ ప్రయత్నంలో కదలి వస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆయన కృతజ్ఞతలు తెలిపారుయ ఇదే విధంగా ఇక ముందు జరగ బోయే అన్ని తమ ఫోరం కార్యక్రమాలకి హాజరై తెలంగాణా ప్రజల కనీస హక్కులు, అవసరాలను గుర్తిస్తూ, వాటికి భంగం కలిగే ఎలాంటి చర్యనైనా కలసికట్టుగా ఎదిరింఛి తెలంగాణా ప్రజల పక్షంలో నిలవడానికి, తెలంగాణా సంస్కృతిని కాపాడే ప్రయత్నానికి మరియు తెలంగాణ రాష్ట్ర సాధన లో అందరూ కలసి రావాలని ఆయన ఆశించారు.












Click it and Unblock the Notifications