లండన్‌లో బతుకమ్మ ఆడిన పడతులు

 Bathukamma performed at London
లండన్: తెలంగాణ ఎన్నారై పోరం ఆధ్వర్యంలో లండన్‌లో బతుకమ్మ సంబరాలు జరిగాయి. కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్, తెలంగాణ రాష్ట్ర సమితి శానససభ్యుడు తన్నీరు హరీష్ రావు, నమస్తే తెలంగాణా దినపత్రిక యజమాని సిఎల్ రాజం దంపతులు ఈ సంబరాలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. లండన్ హౌన్‌స్లోలో శనివారం సుమారు 800 మంది తెలంగాణా బిడ్డలు ఈ సంబరాల్లో పాల్గొన్నారు.

తొలుత నమస్తే తెలంగాణ దినపత్రిక డైరెక్టర్ సి. విజయ జ్యోతి ప్రజ్వలన తో ప్రారంబించి ,బరత నాట్యం తో ప్రారంభించారు . తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థాపక సభ్యులు గంప వేణుగోపాల్, అనిల్ కుర్మాచలం సబాధ్యక్షులుగా వ్యవహరించారు. లండన్ దసరా సంబరాల్లో పాల్గొనే అవకాశం లభించడం పట్ల పొన్నం ప్రభాకర్ సంతోషం వ్యక్తపరిచారు. తెలంగాణా ఇవ్వక తప్పదని, తెలంగాణ తప్పక వస్తుందని తెలిపారు.

తెలంగాణ ఎన్నారై ఫోరం ప్రతిపాదించిన చేనేత కార్మికుల సమస్యను తప్పక పార్లమెంట్ లో ప్రస్తా విస్తానని పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. తెలంగాణ రావాలనే తపన ప్రతి తెలంగాణా బిడ్డకి ఉందని, తప్పకుండ వారి కోరిక తీరుతుందని ఆశాబావం వ్యక్త పరిచారు.

లండన్ లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న తన సంతోషం మాటల్లో చెప్ప లేనని హరీష్ రావు అన్నారు. బతుకమ్మ పండగకు ప్రకృతికి గ సంబంధాన్ని, అందులోని శాస్త్రీయతను ఆయన వివరించారు. ఇలాంటి ప్రకృతి పండుగ ప్రపంచంలో ఎక్కడ లేదని, కేవలం తెలంగాణా వాసులే చేయడం గర్వించదగిందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగపైన చూపే అశ్రద్దను విమర్శించారు . తెలంగాణా ఏర్పాటు చివరి దశకి చేరిందని, ఇవ్వక తప్పదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఇస్తే సంతోషం, ఇవ్వక పోతే 2014 ఎన్నికల్లో తెరాస కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటులో కీలకంగ మారి తెలంగాణ సాధిస్తామని తెలిపారు . సంబరాలకు వచ్చిన అన్ని తెలుగు సంఘాల ప్రతినిధులకు కూడా హరీష్ రావు అభినందనలు తెలిపారు

సంస్థ గత కార్యక్రమాలను, భవిష్యత్ కార్యాచరణను, లక్ష్యాలను గంప వేణుగోపాల్ వివరించారు. బతుకమ్మ పండుగ విశిష్టతను, పండుగ చేసే విధానాన్ని, గౌరమ్మ, బొడ్డెమ్మ, బతుకమ్మల గురించి విజయ లక్ష్మిరాజం వివరించారు. తాము స్పూర్తి ఇవ్వడానికి వచ్చి, మీ వద్ద స్పూర్తి పొందుతున్నామని లక్ష్మీరాజం అన్నారు. ఏ దేశం వెళ్ళిన సంప్రదాయాలను మరువకుండా పండుగలు చేసుకోవడం గర్వించదగిందని ప్రశంసించారు.

అనిల్ కుర్మచలం ప్రముఖులను పరచయం చేశారు. సభకు వ్యాఖ్యాతగా సిక్క చందు గౌడ్ వ్యవహరించి, బతుకమ్మ పోటీల్లో విజేతలకు బహుమతులు, రాఫెల్ విజేతలకు గోల్డ్ కైన్ బహుమతులు ప్రదానం చేశారు.
తెలంగాణ ఉద్యమంలో స్ఫూర్తినిచ్చినవారికి జయశంకర్ పేర బంగారు పతకాలు, రజత పతకాలు ప్రకటించి సత్కరించారు.

వెంకట్ పబ్బతి ,సుధాకర్ ,పోచారం సురేందర్, మధు రెడ్డి, విష్ణు రెడ్డి, రంగు వెంకట్, అశోక్, రాజు కొయ్యడ, వినోద్ రెడ్డి, రాజు,నశ్రీకాంత్, ఉదయ నాగరాజు, తిరుపతి, నగేష్, నరేష్, సతీష్ వాసిరెడ్డి, శ్యాం పిట్ల, సుమన్ ఎడ్ల, గణేష్ బతుకమ్మ సంబరాలు విజయవంతమయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+