బోనాలెత్తిన అమెరికా ఎన్నారైలు
బోనాల పండుగ అనగానే మనకు గుర్తుకు వొచ్చేది తెలంగాణలోని గ్రామ దేవతలు, చక్కగా అలంకరించిన బోనాలు, పోతురాజుల నృత్యాలు, ఆడబిడ్డల భక్తిభావాలతో కూడిన పాటలు. ఖండాంతారాలు దాటినా తెలంగాణ సంస్కృతిని మరువని తెలంగాణ ఎన్నారైలు బోనాల పండగ చేశారు. సిన్సీ తెలంగాణైట్స్ పేర సిన్సిన్నాటి పట్టణానికి చెందిన తెలంగాణా ఎన్నారై గ్రూప్ జూలై 22వ తేదీ ఆదివారం నాడు బోనాల పండుగను సంప్రదాయబద్దంగా, కన్నుల విందుగా జరుపుకుంది.
"మన బొట్టు, మన బోనం, మన సంస్కృతి" అనే మనోభావనను మరువకుండా మొట్ట మొదటి సారి అమెరికా లోని సిన్సినాటి పట్టణంలో బోనాల పండుగ జరిపి తెలంగాణ ఎన్నారైలు చరిత్ర సృష్టించినారు.
ఓహిఒ రాష్ట్రంలోని, గ్రేటర్ సిన్సిన్నాటి ఏరియాలో మేసన్ అనే పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దలు, తల్లులు, ఆడబిడ్డలు, యువతీ యువకులు, పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తెలంగాణ గ్రామాదేవతలకు మూలమైన "ఆది శక్తి" కి బోనం సమర్పించారు.
గ్యాలరీ: అమెరికాలో బోనాల వేడుక
ఆట పాటలతో అందంగా అలంకరించిన బోనాల్ని ఎత్తుకొని ఎన్నారై ఆడపడచులు అమ్మోరుని అత్యంత భక్తి భావాలతో పూజించుకున్నారు. సిన్సి తెలంగాణైట్స్ గ్రూప్ ప్రతిస్తాత్మకంగా తీసుకొని భక్తులకు కావలసిన అన్ని సదుపాయాలు ఏర్పరచింది. కమిటి ఆద్వర్యంలో రుచికరమైన వంటలను, పానీయాలను ఏర్పాటు చేసారు.
ఈ కార్యక్రమానికి సిన్సిన్నాటి లోని పెద్దలు, ప్రసాద్ మీగడ, నారాయణ చాట్ల విచ్చేసి బోనాల తల్లికి పండ్లు పుష్పాలు సమర్పించి, విచ్చేసిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసి, పండుగ ప్రాముఖ్యతను వివరించారు. కమిటి సభ్యులు వేణు కైల, సీతారం బోయినేపల్లి, గణేష్ కోట, శ్రీధర్ పల్లె, శోభన్ పొన్న, సురేష్ దేవరకొండ, చంద్ర మదిచెట్టి, హరి కాసుల, రమేష్ వేములకు కృతజ్ఞత తెలుపుతూ, కార్యక్రమాన్ని ముగించారు. సుమారు వంద మంది పాల్గొన్న ఈ మొట్ట మొదటి "అమెరికా బోనాల పండుగ" కు తెర తీసి, కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
గ్యాలరీ: అమెరికాలో బోనాల వేడుక













Click it and Unblock the Notifications