బోనమెత్తనున్న లండన్ ఎన్నారైలు

బోనాల పండుగలో భాగంగా సంప్రదాయ బోనాల పూజ జరుగుతుంది. ముఖ్య అతిథులు, నిర్వాహకులు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ప్రసంగాలు చేస్తారు. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. గేయాలపన, నృత్యం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
పిల్లలకూ పెద్దలకూ ఆటల పోటీలు జరుపుతారు. విజేతలకు బహుమతుల ప్రదానం కూడా ఉంటుందని తెనా వ్యవస్థాపక సభ్యుడు గంపా వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. దైవ ప్రసాదంతో పాటు తెలంగాణ వంటకాలను వడ్డిస్తారు. తెలంగాణ ఎన్నారై ఫోరం ప్రతినిధులు గంపా వేణుగోపాల్, వెంకట్, వేణు అందెం, శ్రీధర్ బైరీక, తుకారాం, చందు, మధు తదితరులు బోనాల పండుగలో పాలు పంచుకుంటారు.












Click it and Unblock the Notifications