దుబాయ్‌లో ఆంధ్ర డ్రైవర్ హత్య

తూర్పు గోదావరి జిల్లా సఖిలేటిపల్లికి చెందిన కె. సూర్యనారాయణ రాజు (30) రెండు నెలల క్రితం దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఓ ట్రావెల్ ఏజెన్సీలో టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి వివాహమైంది. గుర్తు తెలియని వ్యక్తులు టాక్సీని మాట్లాడుకుని మనుషుల సంచారం లేని ప్రదేశానికి తీసుకుని వెళ్లారు. అక్కడ అతన్ని హత్య చేశారు.
అతన్ని హత్య చేసి మృతదేహాన్ని పక్కన పడేసి, టాక్సీని తీసుకుని దుండగులు పారిపోయారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సూర్యనారాయణ రాజు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించారు.
అతని హత్య వార్త తెలిసిన కుటుంబ సభ్యులు సఖిలేటిపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొని ఉంది. పొట్ట పోసుకోవడానికి వెళ్లిన సూర్యనారాయణ రాజు హత్యకు గురి కావడంతో తట్టుకోలేకపోతున్నారు.












Click it and Unblock the Notifications