ఐరోపా బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరణ

ఐరోపాలోని లండన్, హాన్స్‌లో, లండన్, బర్మింగ్‌హామ్, స్కాట్లాండ్, వేల్స్, ఐర్లాండ్, రెడింగ్, స్లో, హాకింగ్ తదితర నగరాల్లో బతుకమ్మ సంబరాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలను నాలుగు వారాల పాటు శని, అదివారాల్లో నిర్వహిస్తామని వేణుగోపాల్ చెప్పారు.
ఎన్నారై ఫోరం బతుకమ్మ పోస్టర్‌ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాదులో ఆవిష్కరించారు. విదేశాల్లో కూడా ఊరూరా బతుకమ్మ నిర్వహణ గర్వించదగిందని, మన పద్ధతులను, సంస్కృతిని గౌరవిస్తూ ఎన్నారై ఫోరం ఈ సంబరాలు నిర్వహించడం అభినందనీయమని ఆమె అన్నరు.
బతుకమ్మ పోస్టర్ విడుదల కార్యక్రమంలో ఎన్నారై ఫోరం ఇండియా శాఖ ప్రతినిధులు మేడ్చల్ అనిల్, సందీప్ రెడ్డి, జెఎన్‌టియు విద్యార్థి నాయకులు సురేందర్ గౌడ్, సునీల్, స్వామి, ఎ అనిల్, వెంకటేష్ నిత్య , తెలంగాణ ఉద్యమకారుడు అశోక్ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications