అమెరికాలో గురుపూర్ణిమ వేడుకలు

ఆలయ చైర్మన్ పాటిబండ శర్మ తొలి పూజ నిర్వహించారు అనంతరం రావు రాయవరపు, సుచిత్ర ఆధ్వర్యం లో జరిగిన బాబా భజనలకి భక్తులు భక్తి పారవశ్యంలో పులకరించి పోయారు.గురుపౌర్ణమి ఆ షిర్డీ సైనదునికి అత్యంత ప్రియమైన రోజు అని తను మహాసమాధి చెందుతూ ఆరోజు తనని పూజించమని చెప్పిన రోజు అని, ఆ రోజు పూజించి గురువుగా స్వీకరించినవారిని జన్మ జన్మలకి ఆయన ఆశీస్సులు అందజేస్తారని ఆలయ పూజారి తెలిపారు.
అనతరం బాబా హారతులు, అభిషేకం, బాబా రథయాత్ర జరిగాయి.అనంతరం పదకొండు రకాల నైవేద్యాలతో మహాప్రసాదం పంచిపెట్టారు. బాబా భక్తుల నుండి ప్రతివారం భజనలు జరపడానికి అభ్యర్ధనలు వస్తున్నాయని భక్తుల కోరిక మేరకు ప్రతివారం భజనలు జరపడానికి సన్నాహాలు చేస్తున్నామని కార్యక్రమ నిర్వాహకులు ఆనంద్ మన్నెం, శ్రీరాం, బిందు, రవి తదితరులు తెలిపారు.












Click it and Unblock the Notifications