దక్షిణాఫ్రికాలో హైదరాబాదీ మరణం

అందిన వివరాల ప్రకారం - హైదరాబాదులోని సనత్‌నగర్‌కు చెందిన మురహరి కుమారుడు వేణుగోపాల్‌తో లంగర్‌హౌస్‌కు చెందిన రాణితో పదిడేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి అశ్విని అనే 13 ఏళ్ల కూతురు కూడా ఉంది. వేణుగోపాల్ గతంలో రువాండాలో వ్యాపారం చేసి నష్టాల పాలయ్యాడు. దాంతో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగానికి చేరాడు.
నిరుడు అతను హైదరాబాద్ వచ్చాడు. తండ్రి, తమ్ముడు కలిసి రెండు కోట్ల రూపాయల ఆస్తిని లాక్కుని వేణుగోపాల్‌ను వెళ్లగొట్టారు. దీంతో అతను లంగర్‌హౌస్‌లో గల ప్రశాంతనగర్‌లో గల అత్తింట్లో ఉంటూ వస్తున్నాడు. వారం కింద సజికోనోవా కంపెనీ తరఫున దక్షిణాఫ్రికాలో ఉద్యోగం చేయడానికి వెళ్లాడు. తండ్రి, సోదరుడి చర్యతో అతను మనస్తాపానికి గురయ్యాడు. దాంతో బుధవారం గుండెపోటుతో మరణించాడు. వేణుగోపాల్ మరణించిన తర్వాత కూడా తండ్రి, సోదరుడు పరామర్శకు రాలేదు.












Click it and Unblock the Notifications