చైనాలో ఆంధ్రా టెక్కీ భార్య ఆత్మహత్య

ఈమె ఎంసియే పూర్తి చేసింది. రమేష్‌తో 2006లో వివాహం అయింది. మే నెలలోనే తన అయిదు సంవత్సరాల కూతురు సాయి హర్షిణితో చైనాకు వెళ్లిన మృదులా దేవి రెండు రోజుల క్రితం అక్కడ ఉండలేకపోతున్నట్లు అత్తకు ఫోన్ చేసి తెలిపింది. ఈ నేపథ్యంలో శనివారం భారత్‌కు తిరిగి వచ్చేందుకు టిక్కెట్ కూడా బుక్ చేసుకున్నారు. శుక్రవారం రమేష్ బ్యాంకుకు డబ్బుల కోసం వెళ్లిన సమయంలో అపార్టుమెంటు 9వ అంతస్తు పైనుంచి దూకి మృదుల ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు.
సౌదీలో భారతీయుల అరెస్ట్
మరోవైపు మక్కా యాత్ర కోసం భారతదేశం నుంచి సౌదీ అరేబియాకు వచ్చిన ఆరుగురు యా త్రికులను జెడ్డా విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. యాత్రికులు వారివెంట గసగసాలు తీసుకొచ్చారన్న కారణంగా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన జరిగి రెండు నెలలవుతున్నా ఇప్పటివరకు భారత దౌత్యాధికారులకు సమాచారం లేదు.
గసగసాల ద్వారా హెరాయిన్ తయారు చేస్తారు కాబట్టి మాదక ద్రవ్యాల రవాణా కేసు కింద వారిని అరెస్టు చేసినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ నుంచి ముగ్గురు, న్యూఢిల్లీ నుంచి మరో ముగ్గురు అరెస్టైన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించి.. 11 మందిని వదిలిపెట్టారు.












Click it and Unblock the Notifications