• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమెరికాలో కన్నాతో కరచాలనం

By Pratap
|

 Kanna felicitated in USA
వాషింగ్టన్: డిసి మెట్రో ప్రాంతపు ప్రవాసాంధ్రులు మేరిల్యాండ్ రాష్ట్రంలోని ఎల్లికాట్ నగరమందు "కన్నా గారితో కరచాలనం" కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. సుమారుగా 250 మంది ఈ సభకు హాజరయ్యారు. వ్యవసాయ శాఖా మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మంత్రితో పాటు ఆయన సతీమణి శ్రీ విజయలక్ష్మి, ప్రవాసాంధ్రులలో ప్రముఖులైన డాక్టర్ సిర్రం సూర్యనారాయణ మూర్తి వేదిక మీద ఆసీనులయ్యారు.

కార్యక్రమంలొ భాగంగా రాజేశ్ సుంకర స్వాగత వచనాలతొ సభ ప్రారంభమైంది.రాజకీయాలకు ప్రాంతాలకు అతీతంగా తెలుగువారిగా తెలుగు జాతికోసం తెలుగు సమాజాన్ని సంస్కృతిని పరిరక్షించడమే ఈనాటి సభ ముఖ్య ఉద్దేశ్యమని, అందులో భాగంగా ఆంధ్ర దేశంలోని గొప్ప వ్యక్తులలో ఒకరైన కన్నా లక్ష్మి నారాయణను ఆహ్వానించామని రాజేశ్ తమ ప్రసంగంలో తెలిపారు.

పిదప ఈ కార్యక్రమ ముఖ్య నిర్వాహకులు శ్రీనివాస్ చందుమాట్లాడారు. ఎన్నారై సమస్యల పరిష్కారానికి తానెప్పుడు సిద్దంగా వుంటానని మంత్రి కన్నా ఇచ్చిన హామి పట్ల ఆయన హర్షం వ్యక్తం చేసారు. తెలుగుసమాజభివృద్ధి కోసం ఈ రకమైన కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటామని వివిధ రంగాల్లో ప్రముఖులైన వ్యక్తులను ఆహ్వానించి సత్కరిస్తూ ఉంటామని మంత్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

సన్మాన క్రార్యక్రమంలో భాగంగా కార్య నిర్వాహకులు శ్రీనివాస సీలంశెట్టి, రాజేశ్ సుంకర, మధు దాసరి, వెంకట్, శ్రీధర్ వన్నెంరెడ్డి, వెంకట్ సానా, బాబు గుమ్మడి తదితరులు మంత్రిని శాలువాతో సత్కరించారు. మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ప్రసంగిస్తూ - ఇక్కడి తెలుగువారు తమ సాంప్రదాయాలను విడనాడకుండా , కట్టుబాట్లను మరవకుండా తమ తమ విలువలను కాపాడుకుంటుండడం చూసి ఆశ్ఛర్యచకితులయ్యానని అన్నారు.

ఇదే విధంగా భారతావనిలోని తమ కన్న తల్లిదండ్రులను కూడా గౌరవిస్తూ కన్న బిడ్డలుగా విలువలివ్వాలని ఆదరించాలని ఈ సంధర్భంగా ఆయన సలహా ఇచ్చారు. అలాగే తనపై ఎంతో ఆప్యాయత అనురాగాలు కురిపిస్తూ గత మూడు రోజులుగా తన వెంటే ఉంటూ అన్నీ బాగోగులను చూసుకున్న శ్రీనివాస్ చందుని, అతని మితృలను కొనియాడారు.

కన్నా లక్ష్మీ నారాయణ మీద తనే స్వయంగా రచించి పాడిన చంద్ర కాటుబోయిన పాట సభికులను విశేషంగా ఆకట్టుకుంది. భోజన కార్యక్రమాల పిదప శ్రీనివాస సీలంశెట్టి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

English summary
The Agriculture minister Kanna Laxminarayana has been felicitated in Washington DC of USA. Laxminarayan has expressed his happiness for the warm welcome by NRIs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X